Jangaon: ఓబుల్ కేశపూర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ బీభత్సం: 10 ఎకరాల్లో వ్యాపించిన మంటలు.. గడ్డివాములు, మోటార్లు దగ్ధం!
Jangaon: జనగామ జిల్లా ఓబుల్ కేశపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Jangaon: ఓబుల్ కేశపూర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ బీభత్సం: 10 ఎకరాల్లో వ్యాపించిన మంటలు.. గడ్డివాములు, మోటార్లు దగ్ధం!
జనగామ: జనగామ జిల్లా ఓబుల్ కేశపూర్ గ్రామంలో కరెంటు స్తంభాలపై లూసుగా ఉన్న వైర్లు గాలికి ఒకదానికొకటి తాకడంతో షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పంట పొలాలకు అంటుకున్నాయి. దాదాపు 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో గడ్డివాములు, మోటార్ స్టార్టర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. సకాలంలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కరెంటు స్తంభాలపై వైర్లను సరిచేయాలని, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరిగే ప్రమాదం ఉందని రైతులు విద్యుత్ శాఖను కోరుతున్నరు.
Next Story




