Jangaon: జనగామ హోటళ్లు, స్వీట్ షాపులపై అధికారుల దాడులు
Jangaon: జనగామలో బార్, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో అధికారుల తనిఖీలు. నాణ్యత లేని ఒక స్వీట్ షాపు సీజ్, పలువురికి జరిమానాలు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడవద్దు.
Jangaon: జనగామ హోటళ్లు, స్వీట్ షాపులపై అధికారుల దాడులు
జనగామ జిల్లా: జనగామ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడులు. జనగామ లోని పలు బార్ మరియు రెస్టారెంట్ల్ స్వీట్ షాపులలో తనికీలు చేశారు.
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఉన్న పలు షాపులపై జరిమానాలు విధించాం. కిచెన్ లో ఏమాత్రం శుభ్రత లేకుండా నడిపిస్తున్న స్వీట్ షాప్ ను సీజ్ చేశాం.
మేము ప్రజలకు మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ జరిమానాలు విధిస్తున్నాం. గత నెలలో కూడా కొన్ని షాపులకు జరిమానాలు విధించాం మార్పు రావడంలేదు.
నాణ్యత లేకుండా ప్రజలకు ఏది పడితే అది ఇస్తాం అంటే ఊరుకోం. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరు ప్రజలకు ఏది అమ్మిన కఠిన చర్యలు తప్పవు.ప్రజలు తీసుకునే ఆహార పదార్థాలలో ఎలాంటి శుభ్రత పాటించకుండా ఉన్న మాకు సమాచారం ఇవ్వండి.
Next Story




