Jangaon: పెద్దపహాడ్‌లో గొర్రెల పెంపకందారుల భూమి కబ్జాపై వివాదం!
Jangaon: పెద్దపహాడ్ గొర్రెల పెంపకందారుల సంఘం భూమిని నకిలీ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుల ఆవేదన. అఖిల భారత యాదవ మహాసభ సంఘీభావం, న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక.
Jangaon: పెద్దపహాడ్‌లో గొర్రెల పెంపకందారుల భూమి కబ్జాపై వివాదం!
జనగామ: జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకందారుల సంఘానికి చెందిన 4.04 ఎకరాల భూమి (స.నెం. 582/F, 583/G/5) ను ఉస్మానియా ఆగ్రో ఇండస్ట్రీస్ నకిలీ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ (డాక్యు. నెం. 11/2007) చేసుకుందని 130 మంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
2005లో తమ సంఘం పేరున ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని, కలెక్టర్, ఎమ్మార్వో లకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో వివాదాస్పద భూమిని సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి భూమిని ఇప్పించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బనుక సిద్దిరాజ్ యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు పురమాణి రజాక్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తొట్టె నరేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బొంగు ఐలయ్య యాదవ్, నాయకులు గాజుల సిద్దిలింగం యాదవ్, మేకల మహానందు యాదవ్, సాదం మధుసూదన్ యాదవ్, బూస రమేష్ యాదవ్, దడిగే రవికుమార్ యాదవ్, మారబోయిన ప్రకాష్ యాదవ్, గంగుల మధు, కారే రమేష్, కారే కరుణాకర్ తదితరులు.




