Jangaon: జనగామలో అక్రమ అబార్షన్ల ముఠా గుట్టురట్టు ముగ్గురు అరెస్ట్

Jangaon: జనగామలో అక్రమ అబార్షన్లు చేస్తున్న ఆర్‌ఎంపీ, ఏఎన్‌ఎంలతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి కోసం తీవ్ర గాలింపు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 1 Aug 2026 8:52 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో అక్రమ అబార్షన్ల ముఠా గుట్టురట్టు ముగ్గురు అరెస్ట్

జనగామ: అక్రమ అబార్షనులు చేసే నిందితులను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నేరానికి పాల్పడిన RMP రచ్చ శ్రవణ్ ANM గుండే అనసూర్య,మల్కాపుర శోభ నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేకంగా వెతుకుతున్నామని తెలిపారు. అక్రమ గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్య నేరమని ఇలాంటి నేరాలకుపాల్పడినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ శ్వేత అభినందించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story