devaruppula: దేవరుప్పులలో ప్రజా పాలన గ్రామసభ సమస్యల పరిష్కారమే ధ్యేయం!

devaruppula: జనగామ జిల్లా దేవరుప్పులలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ గ్రామసభ.

S MAHENDER, PALAKURTHI
Published on: 6 Jun 2026 7:22 PM IST
Jangaon
X

devaruppula: దేవరుప్పులలో ప్రజా పాలన గ్రామసభ సమస్యల పరిష్కారమే ధ్యేయం!

దేవరుప్పుల: దేవరుప్పుల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆద్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్బంగా సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను భాగస్వామి చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందజేసేలా క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని

ప్రజల సమస్యలు పరిష్కాకారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని,గ్రామ అభివృద్ధి,గ్రామ సమస్యల గుర్తింపు,పదకాల అమలులో పారదర్శకత పెంపుకోసం సమగ్ర చర్చ జరిపారు.ఈ కార్యక్రమంలో విద్య శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు,ఆరోగ్యశాఖ అధికారులు,ఉప సర్పంచ్ నర్రా కోమలత,పంచాయతీ సెక్రెటరీ,గ్రామపంచాయతీ వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story