Jangaon: ఇందిరమ్మ ఇళ్ల సభలో సర్పంచులకు అవమానం: శ్రీధర్ గౌడ్

Jangaon: జనగామలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ సభలో సర్పంచులను వేదికపైకి పిలవకపోవడాన్ని సర్పంచుల సంఘం ఖండించింది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Sept 2026 8:55 PM IST
Jangaon
X

Jangaon: ఇందిరమ్మ ఇళ్ల సభలో సర్పంచులకు అవమానం: శ్రీధర్ గౌడ్

జనగామ జిల్లా: ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుపేద కుటుంబాలకు రెండో విడతగా ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హాజరయ్యారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడి, గ్రామ పంచాయతీలకు ప్రజాప్రతినిధులుగా సేవలందిస్తున్న సర్పంచులను వేదికపైకి ఆహ్వానించకుండా, కేవలం మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు వార్డు కౌన్సిలర్లను మాత్రమే వేదికపైకి ఆహ్వానించడం బాధాకరం.

గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న సర్పంచులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ద్వారా జనగామ జిల్లా సర్పంచుల మనోభావాలను దెబ్బతీశారని భావిస్తున్నాము.

సర్పంచులు గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. గ్రామీణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సర్పంచుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి సర్పంచులను అధికారిక కార్యక్రమాల్లో విస్మరించడం సరైన పద్ధతి కాదని తెలియజేస్తున్నాము.

ఈ ఘటనను జనగామ జిల్లా సర్పంచుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులకు తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

సర్పంచుల గౌరవం – గ్రామ ప్రజల గౌరవం

మన ఐక్యత – మన బలం

గోపగోని శ్రీధర్ గౌడ్

సర్పంచ్, నర్మెట్ట

జనగామ జిల్లా సర్పంచుల సంఘం

జిల్లా అధ్యక్షులు

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON