Singarajupally: సింగరాజుపల్లిలో టీచర్ల బదిలీకి డిమాండ్

Singarajupally: జనగామ జిల్లా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేయాలని సర్పంచ్ కొండ ఊర్మిళ మల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై నిరసన తెలిపారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 23 July 2026 12:17 PM IST
Singarajupally
X

Singarajupally: సింగరాజుపల్లిలో టీచర్ల బదిలీకి డిమాండ్

జనగామ జిల్లా:దేవరుప్పుల మండలం, సింగరాజు పల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో గత కొద్ది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ,విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు పాఠశాల యాజమాన్యం,విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోమవారం గ్రామ సర్పంచ్ కొండ ఊర్మిళ మల్లారెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు,యువత,గ్రామ పెద్దలు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత ఉపాధ్యాయులను వెంటనే బదిలీ చేసి,విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల చదువుతో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులను కొనసాగించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని,ఇకపై అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని,లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story