Jangaon: జనగామ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ జరపాలి

Jangaon: జనగామ జిల్లా సిరిసన్నగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అక్రమ ప్రవేశం. బాధ్యులపై విచారణ జరపాలని ఎమ్మార్వోకు టీఆర్పీ పార్టీ నేతల వినతి.

S MAHENDER, PALAKURTHI
Published on: 14 July 2026 7:43 PM IST
Jangaon
X

Jangaon: జనగామ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ జరపాలి

జనగామ జిల్లా: పాలకుర్తి మండల పరిధిలోని సిరిసన్నగూడెం గ్రామంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి జరిగిన అనధికారిక ప్రవేశాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని టీఆర్పీ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు పార్టీ జనగామ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం వారు ఎమ్మార్వో గారికి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా, లబ్ధిదారులకు కేటాయించడంలో స్థానిక అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని,అర్హులను ఎంపిక చేసి ఇళ్లను అప్పగించడంలో అధికారులు కాలయాపన చేయడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని,అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం.

వారి ఉదాసీనత వల్లే విసిగిపోయిన కొందరు గ్రామస్థులు మార్చి 25న అనధికారికంగా ఇళ్లలోకి ప్రవేశించాల్సి వచ్చిందని,ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా, వారు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని,ఈ జాప్యం,నిర్లక్ష్యం వల్ల నిజమైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని,సొంత ఇల్లు లేక అద్దెలు కట్టలేక పేదలు అల్లాడుతుంటే, నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా తాత్సార్యం చేయడం.

అధికారుల బాధ్యతారాహిత్యమేనని,ఈ సమస్యపై స్థానిక ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి గారు కూడా తక్షణమే స్పందించాలని,ఇకనైనా అధికారులు, తక్షణమే పారదర్శకమైన సర్వే నిర్వహించి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజమైన అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని,లేనిపక్షంలో బాధితుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు బబ్బులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి నర్సింగారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, జిల్లా నాయకులు అంజిత్ పాషా, పట్టణ అధ్యక్షులు పాషా, గ్రామ బాధితులు తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story