Jangaon: పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలి: జనగామలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ భారీ అవగాహన ర్యాలీ!

Jangaon: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లాలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 May 2026 6:25 PM IST
Jangaon
X

Jangaon: పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలి: జనగామలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ భారీ అవగాహన ర్యాలీ!

జనగామ జిల్లా: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (31 మే 2026) సందర్భంగా జనగామ జిల్లాలో పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐడీఓసీ నుంచి బస్ స్టాండ్ ఎక్స్ రోడ్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కె. మల్లిఖార్జున్ రావు, జనగామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సత్యనారాయణ రెడ్డి, విద్యాశాఖ ప్రతినిధి గౌసియా బేగం, ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, నోటి సంబంధిత వ్యాధులు మరియు అకాల మరణాలకు ప్రధాన కారణమవుతుందని తెలిపారు. అలాగే, పొగ త్రాగని వ్యక్తులు కూడా పరోక్ష ధూమపానం (Second-hand Smoke) వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారని పేర్కొన్నారు.

యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ఆరోగ్య శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు, చట్ట అమలు చర్యలు చేపడుతుందని తెలిపారు.

ఈ ర్యాలీలో ప్రోగ్రామ్ అధికారులు డా. ఆర్. సుధీర్, డా. ఎల్. అశోక్ కుమార్, డా. కమల్ హసన్, యూపీహెచ్‌సీ, బీడీకే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, కళాజాత బృంద సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు పొగాకు వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story