Jangaon: మల్కాపూర్‌లో రక్తదానంతో రంజిత్ రెడ్డి జన్మదినం!
Jangaon: చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో 29వ సారి రక్తదానం చేసి వినూత్నంగా పుట్టినరోజు జరుపుకున్న రంజిత్ రెడ్డి. ఆదర్శంగా నిలిచిన యువకుడు.
Jangaon: మల్కాపూర్‌లో రక్తదానంతో రంజిత్ రెడ్డి జన్మదినం!
Jangaon: జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ రెడ్డి తన జన్మదినాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా హనుమకొండలోని రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. ఇది ఆయన చేస్తున్న 29వ సారి రక్తదానం కావడం విశేషం పుట్టినరోజు అంటే కేకులు, పార్టీలు కాదని, నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని రంజిత్ రెడ్డి అన్నారు. యువత కూడా రక్తదానంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు...




