Kataram: ముత్తారం పీఎస్, కాటారం సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ తనిఖీలు!

Kataram: కాటారంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వార్షిక తనిఖీలు ముత్తారం పీఎస్, సర్కిల్ ఆఫీస్‌ల పరిశీలన విజిబుల్ పోలీసింగ్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 6:29 PM IST
Kataram
X

Kataram: ముత్తారం పీఎస్, కాటారం సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ తనిఖీలు!

కాటారం: వార్షిక తనిఖీల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ముత్తారం పోలీస్ స్టేషన్, కాటారం సర్కిల్ కార్యాలయాలను మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ఆయుధాగారం, సిబ్బంది క్రమశిక్షణ, విధుల నిర్వహణ, సీసీటీవీ పనితీరును పరిశీలించారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు వంటి సాంకేతికతను వినియోగించి పెండింగ్ కేసులు పరిష్కరించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా కొనసాగించాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్‌ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్