JD Mallampalli: గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి వీజీపీపీ ప్రణాళికలు

JD Mallampalli: జేడీ మల్లంపల్లిలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కొరకు వీజీపీపీ ప్రణాళికల రూపకల్పన. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల గుర్తింపు.

PONNALA SWAMY, MULUGU
Published on: 22 Sept 2026 9:53 PM IST
JD Mallampalli
X

JD Mallampalli: గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి వీజీపీపీ ప్రణాళికలు

జేడీ మల్లంపల్లి: గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు (వీజీపీపీ) రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గ్రామంలోని వాస్తవ అవసరాలు,అందుబాటులో ఉన్న వనరులు,ఇప్పటికే ఉన్న ఆస్తులు,మౌలిక వసతులు,అభివృద్ధి లోటుపాట్లను గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను ఎంపిక చేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

గ్రామంలోని వనరులు,మౌలిక వసతులు, అవసరాలను రిసోర్స్ మ్యాప్ ద్వారా గుర్తించి భవిష్యత్ అభివృద్ధి పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.ప్రజల సూచనలు,అవసరాలను పరిగణనలోకి తీసుకుని గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రహముద్దీన్,ఎంపీఓ మహేందర్,ఏపీఓ సునీత,సర్పంచ్ వనిత రాజేందర్,ఉపసర్పంచ్ వాగ్య,వార్డు సభ్యులు,టీఏలు,పంచాయతీ కార్యదర్శి,ఎఫ్ఏ,ఐకేపీ సీసీ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU