Gudur: ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యలను తప్పుగా భావించొద్దు.. జెన్నారెడ్డి పద్మజ!
Gudur: గూడూరులో సంక్షేమ పథకాలు వివరించే క్రమంలో ఎంపీ బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా భావించవద్దని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జెన్నారెడ్డి పద్మజ కోరారు.
Gudur: ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యలను తప్పుగా భావించొద్దు.. జెన్నారెడ్డి పద్మజ!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి స్వామి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జెన్నారెడ్డి పద్మజ మాట్లాడుతూ మహిళలు అంటే అక్కా చెల్లెలుగా భావించే ఎంపీ పోరిక బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా భావించొద్దని అమె కోరారు.
మంగళవారం గూడూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడిన మాటలపై ఆమె వివరణ ఇచ్చారు. ఎంపీ బలరాం నాయక్ మృదుస్వభావి, అందరినీ ఆప్యాయతగా చేరదీసే మనసత్వం తనది అని, మహిళలను దూషించే ఉద్దేశం తనది కాదు అని అందరిని కలుపుకోపోయే గుణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కత్తి స్వామి, మాజీ సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్, మాధవపెద్ది అమరేందర్ రెడ్డి, ఐలబోయిన సమ్మక్క, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.




