Mahabubabad: మహబూబాబాద్‌లో స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు

Mahabubabad: మహబూబాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో వైద్య, పోలీస్, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలని హెచ్చరించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 6 Nov 2026 3:14 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు

మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల లో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆసుపత్రుల్లోని స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులు , సీసీ కెమెరాల్లోని విజువల్స్ ను పరిశీలించారు. ప్రతి వైద్య పరీక్ష వివరాలను తప్పనిసరిగా, రికార్డుల్లో నమోదు చేయాలని, ధరల పట్టికను ప్రదర్శించాలని వారిని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారి రవి రాథోడ్ మాట్లాడుతూ, సమాజంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని , గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, భ్రూణ హత్యలకు పాల్పడటం వంటి చట్టవిరుద్ధ చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించినా.. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినా , సీసీ కెమెరాలు లేకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా స్త్రీ , పురుష నిష్పత్తిలో 15 వ స్థానంలో ఉందని ,లింగ వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా ప్రజల కు విజ్ఞప్తి చేశారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad