Kamalapuram: మట్టి గణపతుల తయారీలో విద్యార్థుల సందడి.. కమలాపురంలో సంబరం!
Kamalapuram: ములుగు జిల్లా కమలాపురం ZPHSలో విద్యార్థులు 100కు పైగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటిచెప్పారు.
Kamalapuram: మట్టి గణపతుల తయారీలో విద్యార్థుల సందడి.. కమలాపురంలో సంబరం!
ములుగు జిల్లా: మంగపేట మండలం కమలాపురంలోని ZPHS పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. జ్వాలా చారిటబుల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక JVV ములుగు జిల్లా సైన్స్ విభాగం, ZPHS కమలాపురం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇంచార్జి హెడ్‌మాస్టర్లు ప్రసాద్, సునీతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకున్నారు. దాదాపు వందకు పైగా మట్టి గణపతి విగ్రహాలను విద్యార్థులు తయారు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, JVV హెల్త్ కన్వీనర్ మనిగాలా రాకేష్ మాట్లాడుతూ... విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారయ్యే విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని వినాయక చవితి సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు ముందుండాలని, చిన్ననాటి నుంచే ప్రకృతిని కాపాడే బాధ్యతను అలవర్చుకోవాలని రాకేష్ సూచించారు. అనంతరం చక్కగా గణపతి విగ్రహాలను తయారు చేసిన ముగ్గురు విద్యార్థులకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్‌మాస్టర్లు ప్రసాద్, సునీతతో పాటు ఉపాధ్యాయులు నాగమ్మ, నాగలక్ష్మి, మౌలాలి, రాజేశ్వర్, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులనే పూజిద్దాం... ప్రకృతిని పరిరక్షిద్దాం... అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు చాటిచెప్పారు.




