Hanamkonda: గ్రామంలో ఐరన్ పోల్స్ రహితమే మా లక్ష్యం సర్పంచ్ తిరుపతి!

Hanamkonda: కంటాత్మకూర్ గ్రామంలో ప్రమాదకర ఐరన్ పోల్స్ తొలగింపు పనులు ప్రారంభం. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సర్పంచ్ కొంగంటి తిరుపతి కృతజ్ఞతలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Sept 2026 12:05 PM IST
Hanamkonda
X

Hanamkonda: గ్రామంలో ఐరన్ పోల్స్ రహితమే మా లక్ష్యం సర్పంచ్ తిరుపతి!

Hanamkonda: గ్రామంలో ఐరన్ పోల్స్ లేకుండా చేయడమే మా లక్ష్యం. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు. సర్పంచ్ కోంగంటి తిరుపతి. 26 ఐరన్ పోల్స్ తొలగించి సిమెంట్ పోల్స్ జేఎల్ఎం ప్రసాద్ గారి పర్యవేక్షణలో జరుగుతున్న పనులను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు.

ఈ సందర్భంగా నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ,

ఐరన్ పోల్స్ వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో గ్రామానికి 26 సిమెంట్ పోల్స్ మంజూరు కావడం జరిగిందని తెలిపారు.

ఐరన్ పోల్స్ ఉన్నచోట వాటిని వెంటనే తొలగించి సిమెంట్ పోల్స్ వేయడం జరుగుతుందని, మిగతా ఐరన్ పోల్స్ కూడా రోజులవారీగా

తొలగించి సిమెంట్ పోల్స్ వేయడం జరుగుతుందని అన్నారు. ఏ వార్డులో పని జరుగుతుందో అక్కడ కరెంటు కొంతసేపు బంద్ చేయాల్సి ఉంటుందని, కావున ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమారస్వామి , 4వ వార్డు సభ్యులు తడక రఘుపతి , పంచాయతీ కార్యదర్శి ఆవుల కుమార్ , జేఎల్ఎం ప్రసాద్ , అసిస్టెంట్ కరుణాకర్ , ఫీల్డ్ అసిస్టెంట్ రాజు , గ్రామపంచాయతీ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL