Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్ మర్రిచెట్టు శివాలయంలో కార్తీక పౌర్ణమి శోభ!

Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులు 365 వత్తుల దీపాలు వెలిగించి పూజలు చేశారు.

V Ravikiran, Jangaon
Published on: 24 Nov 2026 11:19 PM IST
Station Ghanpur
X

Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్ మర్రిచెట్టు శివాలయంలో కార్తీక పౌర్ణమి శోభ!

స్టేషన్ ఘన్‌పూర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘన్‌పూర్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం శివునికి ఎంతో ప్రత్యేకమైన మాసం. దాదాపు నెల రోజుల పాటు భక్తులు ఉదయం, సాయంత్రం ఇళ్లల్లో దీపాలు పెట్టి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

అందులో భాగంగా మంగళవారం మర్రిచెట్టు శివాలయంలో 365 వత్తుల దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దీప కాంతులతో శివాలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది.ఈ కార్యక్రమంలో పూజారులు రామలింగ శర్మ, ప్రవీణ్ శర్మ, శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ బండ్ల రాధాకృష్ణ - అరుణ కుమారి దంపతులు, కొలిపాక సునీత - సతీష్ దంపతులు, గట్టు సుకన్య - రంజిత్, గట్టు రజిత - కుమారస్వామి, గణేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon