Seerole: కార్తీక పౌర్ణమి వేడుకలు.. సీరోలు శివాలయంలో సహస్ర దీపోత్సవం!
Seerole: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని శివాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సహస్ర దీపోత్సవం ఘనంగా జరిగింది.
Seerole: కార్తీక పౌర్ణమి వేడుకలు.. సీరోలు శివాలయంలో సహస్ర దీపోత్సవం!
మహబూబాబాద్ జిల్లా: సీరోల్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ కు దత్తగా ఉన్న శ్రీ శివాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో సహస్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెడవెల్లి హర్షవర్ధన్ రెడ్డి దంపతులు భక్తులతో కలిసి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కలిసి ఆలయంలో సహస్ర దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని, దీపం వెలిగించడం వల్ల ఆధ్యాత్మిక పెంపు మానసిక ప్రశాంతత, శుభఫలాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర దీపాలంకరణ వెలుగులతో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.




