Kesamudram: ఉప్పరపల్లిలో పోలీసుల కళాజాత.. మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై అవగాహన!

Kesamudram: ఉప్పరపల్లిలో కేసముద్రం పోలీసుల కళాజాత. మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించిన పోలీసులు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 27 Aug 2026 7:41 AM IST
Kesamudram
X

Kesamudram: ఉప్పరపల్లిలో పోలీసుల కళాజాత.. మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై అవగాహన!

Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో మూఢనమ్మకాలు , సైబర్ నేరాలు, ఆన్ లైన్ గేమ్స్ తదితర అంశాలపై కేసముద్రం పోలీసులు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు నేటికి మూఢాచారాలను నమ్ముతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. సైబర్ నేరాలు ఏవిధంగా జరుగుతున్నాయి. అమాయకులకు సైబర్ నేరస్తులు ఫోన్లు చేసి ఏ విధంగా వల వేస్తున్నారో ప్రాక్టికల్ గా చేసి చూపించారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పోలీస్ కళా బృందం ప్రదర్శించిన వాటిన తిలకించారు. అనంతరం సిఐ సత్యనారాయణ ను గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత కుమార్ శాలువా కప్పి సన్మానించారు.

ఈ ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఐలయ్య వార్డు సభ్యులు బాల కుమార్, అనిల్, జ్యోతి, ప్రియాంక, ప్రవీణ్, శ్రీనివాస్, కారో కట్టయ్య గ్రామపంచాయతీ సిబ్బంది. పోలీస్ సిబ్బంది. గ్రామస్తులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story