Kesamudram:కేసముద్రంలో నివాళులు ప్రిన్సిపాల్ రూపారెడ్డికి పాఠశాల శ్రద్ధాంజలి!

Kesamudram: నల్లగొండ జిల్లాలో మృతి చెందిన ప్రిన్సిపాల్ రూపారెడ్డికి కేసముద్రం శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఘన నివాళి.

A.Rajkumar, Mahabubabad
Published on: 22 Aug 2026 1:17 PM IST
Kesamudram
X

Kesamudram:కేసముద్రంలో నివాళులు ప్రిన్సిపాల్ రూపారెడ్డికి పాఠశాల శ్రద్ధాంజలి!

Kesamudram: నల్లగొండ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనలో మృతి చెందిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారికి ఈరోజు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రెండు నిమిషాల మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ రూపారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మార్గదర్శకులని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు లేదా ఆవేశాలకు లోనై తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాలు నాశనమవుతాయని అన్నారు. విద్యార్థులు కోపం, ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని పెద్దల సూచనలు, ఉపాధ్యాయుల సలహాలను గౌరవించాలని సూచించారు.

పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆలయాలని ఆయన అన్నారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. రూపారెడ్డి మృతి విద్యారంగానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని రూపారెడ్డి గారికి నివాళులర్పించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story