Kothaguda: కొత్తగూడలో ఏబీవీపీ స్కూళ్ల బంద్ సక్సెస్.. నిరసనలు ఉధృతం!
Kothaguda: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడ మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతంగా జరిగింది.
Kothaguda: కొత్తగూడలో ఏబీవీపీ స్కూళ్ల బంద్ సక్సెస్.. నిరసనలు ఉధృతం!
కొత్తగూడ: ప్రయివేటు పాఠశాల లొ అధిక ఫీజు దోపిడీని అరికట్టాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల ను ఎత్తివేతకు చేసే కుట్రలను నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ABVP) రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల ల బంద్ కొత్తగూడ మండలం లొ విజయవంతం గా జరిగింది.
ఏబీవీపీ నాయకులు మండలం లోని ప్రభుత్వ పాఠశాల కు వెళ్లి బంద్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ పూర్వ జిల్లా కన్వీనర్ పాకాల మునిందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లొ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం గా మారిందని, విద్యా శాఖ కు కనీసం మంత్రి కూడ లేదని గురుకులాల్లో ఫుడ్ పాయిషన్ జరిగిన, ప్రభుత్వ హాస్టల్ లలో కనీసం మౌలిక సదుపాయాలు లేకున్న పట్టించుకునే నాధుడే లేడని అన్నారు.
ప్రభుత్వం ప్రయివేట్ పాఠశాల యాజమాన్యం తో కుమ్మక్కు అయ్యి వాళ్ళు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమం లొ ఏబీవీపీ నాయకులు చరణ్,బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.




