Kothakonda: కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే!
Kothakonda: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు. కైలాస యాత్ర అనుభవాలను పండితులతో పంచుకున్న వైనం.
Kothakonda: కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే!
Kothakonda: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, నియోజకవర్గంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని వీరభద్ర స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం ఇటీవల చేపట్టిన మౌంట్ కైలాస్ యాత్రలో భాగంగా అక్కడ వీరభద్ర స్వామి రూపాన్ని దర్శించిన విషయాన్ని ఆలయ పండితులకు , అర్చకులకు మాజీ ఎమ్మెల్యే వివరించారు. కైలాస క్షేత్రంలో వీరభద్ర స్వామి రూప దర్శనం యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, పురాణ ప్రాధాన్యతను అర్చకులకు పూర్తిస్థాయిలో వివరించారు.
వీరభద్ర స్వామివారి దర్శనం అనంతరం మాజీ ఎమ్మెల్యే గారు ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంతోషం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




