Kothakota: శాకాంబరి మాతగా శ్రీ అంబాభవాని అమ్మవారి అలంకరణ
Kothakota: కొత్తకోట అంబాభవాని ఆలయంలో ఆషాడమాస శాకాంబరి ఉత్సవం. అమ్మవారికి 101 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించిన మహిళా భక్తులు.
Kothakota: శాకాంబరి మాతగా శ్రీ అంబాభవాని అమ్మవారి అలంకరణ
కొత్తకోట: కొత్తకోట పట్టణంలోని శ్రీ అంబాభవాని దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారిని శాకాంబరి మాతగా రకరకాల కాయగూరలు , ఆకుకూరలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి 101 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మఠం సదాశివయ్య , మఠం ఆనందయ్య గార్లు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించగా భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
పూజల అనంతరం భక్తులకు అమ్మవారికి నైవేద్యంగా తెచ్చిన పిండి వంటలు తీర్థప్రసాదాలుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పొగాకు అనీల్ కుమార్ సోదరులు ఎర్పాట్లను పర్యవేక్షించగా మహిళా భక్తులు, పట్టణ ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.




