Mahabubabad: ఈ నెల 29న కేటీఆర్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన సత్యవతి రాథోడ్!
Mahabubabad: ఈ నెల 29న జరగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభా ఏర్పాట్లను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేతలతో కలిసి పరిశీలించారు.
Mahabubabad: ఈ నెల 29న కేటీఆర్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన సత్యవతి రాథోడ్!
మహబూబాబాద్: 10 సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలన లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తే.. కాంగ్రెస్ పాలన లో 10 సంవత్సరాలు వెనుకకు పోయిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఈ నెల 29 న మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని పి.ఎస్.ఆర్ గార్డెన్స్ లో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే సభా ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత , ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు , మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ లతో కలిసి పరిశీలించారు.
అనంతరం పార్టీ కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..సర్ పై మహబూబాబాద్ , డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ లు.. పార్టీ సమన్వయకర్తలకు అవగాహన కల్పించేందుకు కేటీఆర్ వస్తున్నాడని , పార్టీ శ్రేణులంతా హాజరై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.
సర్ ప్రక్రియ పేరుతో పశ్చిమ బెంగాల్ , తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్లను తొలగించారని దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న పార్టీలు ఓడిపోయాయని , తెలంగాణ రాష్ట్రం లో జరిగే సర్ ప్రక్రియ కు బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని , ప్రతి బూత్ లో అన్ని ఓట్లు ఉన్నాయో లేవో సరి చూసుకోవాలని , ఏమైనా సమస్యలు ఉంటే బి ఎల్ వో లు సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ఈ నెల నుంచే బిఆర్ఎస్ సభ్యత్వాలను డిజిటల్ రూపంలో చేయనున్నారని తెలిపారు. ఇక్కడ 2 రు ఎమ్మెల్యేలు ఉండి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




