Warangal: కాకతీయ యూనివర్సిటీలో హరితహారం.. మొక్కలు నాటిన వీసీ ప్రతాప్ రెడ్డి!

Warangal: కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ఇంచార్జ్ అవెన్యూ ప్లాంటేషన్ వెంకట గోపినాథ్ ఆధ్వర్యంలో వీసీ ప్రతాప్ రెడ్డి మొక్కలు నాటారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 1:54 PM IST
Warangal
X

Warangal: కాకతీయ యూనివర్సిటీలో హరితహారం.. మొక్కలు నాటిన వీసీ ప్రతాప్ రెడ్డి!

Warangal: కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగ పరిసరాలలో కేయూ అవెన్యూ ప్లాంటేషన్ అద్వర్యంలో కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా వీసీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణాల తొలగించిన చెట్ల నిష్పత్తిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటటం జరుగుతుందని అన్నారు. వివిధ స్వచ్చంద సంస్థలతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు.

రాబోవు రోజులలో వరంగల్ నగరానికి మంచి ఆమ్లజని అందించే ప్రదేశం యూనివర్సిటీ అవుతుందని అన్నారు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. జిల్లా అటవీ శాఖా అధికారుల సహాయం కుడా అబినందనియం అన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ బి. రమ, డాక్టర్ చిర్రా రాజు, కే. అనితారెడ్డి, సోషియాలజీ విభాగ అధిపతి ఆచార్య ఎం. స్వర్ణలత, ఇంచార్జ్ అవెన్యూ ప్లాంటేషన్ డాక్టర్ బి. వెంకట గోపినాద్ తో పాటు పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్