Warangal: వరంగల్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గుండు సుధారాణి!
Warangal: వరంగల్లోని చిన్న వడ్డేపల్లి, కాశిబుగ్గ, ఉర్సు ప్రాంతాలలో జరిగిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పాల్గొని మహిళలతో ఆడిపాడారు.
Warangal: వరంగల్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గుండు సుధారాణి!
Warangal: సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆదివారం రోజున కాకతీయ పట్టనాభివృద్ధి సంస్థ (KUDA) చైర్ పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జి డబ్ల్యూ ఎం సి మాజీ మేయర్ "శ్రీమతి గుండు సుధారాణి" గారు వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు, కొత్తవాడ తోట మైదానం, కాశిబుగ్గ, ఉర్సు రంగసముద్రం ప్రాంతాలలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడి, బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలలో ప్రసంగించినారు.
ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్లు బయ్య స్వామి, ముష్కమల్ల అరుణ సుధాకర్, బసవరాజు కుమార్, ఎలుగం లీలావతి సత్యనారాయణ, దామెర సర్వేశ్ లతోపాటు ఓగిలిశెట్టి అనిల్ కుమార్, కూచన శంకర్, రుద్ర శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




