Kuravi: గుండెపోటుతో అంగన్‌వాడీ టీచర్ ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి
Kuravi: కురవిలో గుండెపోటుతో అంగన్‌వాడీ టీచర్ ఉమామహేశ్వరి మృతి. ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్.
Kuravi: గుండెపోటుతో అంగన్‌వాడీ టీచర్ ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి
కురవి: కురవి మండల కేంద్రానికి చెందిన అంగన్‌వాడీ టీచర్, గౌడ సంఘం నాయకుడు బండారి రమేష్ సతీమణి ఉమామహేశ్వరి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఉమామహేశ్వరి మృతదేహానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.




