Kuravi: ఆగమైపోతున్న కురవి పశువుల సంత.. సీపీఐ నేత తురక రమేష్ ఆవేదన!

Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి పశువుల సంత కోట్ల ఆదాయం నుంచి రూ. 30.40 లక్షలకు పడిపోవడంపై సీపీఐ టౌన్ కార్యదర్శి తురక రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 14 Sept 2026 10:26 AM IST
Kuravi
X

Kuravi: ఆగమైపోతున్న కురవి పశువుల సంత.. సీపీఐ నేత తురక రమేష్ ఆవేదన!

Kuravi: ఒకప్పుడు కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చిన కురవి పశువుల సంత ప్రస్తుతం రూ.30.40 లక్షల ఆదాయానికి పడిపోయిందని కురవి సీపీఐ టౌన్ కార్యదర్శి తురక రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల సంత అభివృద్ధి కుంటుపడటంతో క్రమంగా ఆదరణ కోల్పోతూ ఆగమైపోతున్న పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

కురవి పశువుల సంత ఆదాయం ఇంతగా పడిపోవడానికి గల కారణాలు ఆ వీరభద్ర స్వామికే తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కురవి పశువుల సంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సంతను పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, రైతులు, పశువుల వ్యాపారులకు అనుకూలంగా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

– తురక రమేష్, కురవి సీపీఐ టౌన్ కార్యదర్శి

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL