Kuravi: కురవి ఓటరు జాబితా డిజిటలైజేషన్‌ను పరిశీలించిన కలెక్టర్
Kuravi: కురవిలో ఎస్ఐఆర్ సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరిష్. 2002 ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశం.
Kuravi: కురవి ఓటరు జాబితా డిజిటలైజేషన్‌ను పరిశీలించిన కలెక్టర్
కురవి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కురవి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎనుమురేషన్స్ ఫార్మ్స్ పంపిణీ చేయడం పూర్తి అయ్యిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి బూతు లెవల్ అధికారులు వెళ్లి వివరాలు సేకరించి 2002 ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాలని
అందుబాటులో లేని వివరాలను గుర్తించాలని, వేగంగా ఈ ప్రక్రియ మొత్తం కొనసాగాలని ఆదేశించారు, ఇప్పటికే జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగడంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు, కలెక్టర్ వెంట తహసిల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




