Gudur: గూడూరు అడవుల్లో చిరుత పులి సంచారం ప్రజలు అప్రమత్తం!
Gudur: మహబూబాబాద్ జిల్లా దామవంచ అడవుల్లో చిరుత పులి అడుగుజాడలు గుర్తింపు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. ఎఫ్ఆర్వో ప్రసాద్ రావు అలర్ట్.
Gudur: గూడూరు అడవుల్లో చిరుత పులి సంచారం ప్రజలు అప్రమత్తం!
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామవంచ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దామవంచ అడవి బిట్ పరిధిలో చిరుత పులికి సంబంధించిన పాదముద్రలు, ఇతర ఆనవాళ్లు లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అటవీ శాఖ అధికారుల విజ్ఞప్తి
"చిరుత పులి సంచారంపై స్థానిక ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ సిబ్బందికి తెలియజేయాలి.అని ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ రావు తెలిపారు.
ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది చిరుత కదలికలను కనిపెట్టడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ వార్తతో చుట్టుపక్కల గ్రామాల్లో కాస్త ఆందోళన నెలకొన్నప్పటికీ, అధికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.




