Khanapuram: ఖానాపురం మండలంలో చిరుత సంచారం.. భయాందోళనలో జనం!
Khanapuram: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట శివారులోని పామాయిల్ తోటల్లో చిరుత పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.
Khanapuram: ఖానాపురం మండలంలో చిరుత సంచారం.. భయాందోళనలో జనం!
ఖానాపురం: మండలం రాగంపేట శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.శివారులో విస్తారంగా పామాయిల్ తోటలు ఉండటంతో నక్కల వర్రే కాలువ వెంబడి మనుబోతులగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి పులి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన నాగ అనే వ్యక్తికి చిరుత పులి కనిపించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో గ్రామంతో పాటు మండలంలోని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది
Next Story




