Maripeda: మరిపెడలో తప్పిపోయిన పిల్లి.. రూ.500 పారితోషికం!
Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో తప్పిపోయిన తమ పెంపుడు పిల్లి ఆచూకీ తెలిపిన వారికి రూ.500 పారితోషికం ఇస్తామని యజమాని కుటుంబం పోస్టర్లు వేసింది.
Maripeda: మరిపెడలో తప్పిపోయిన పిల్లి.. రూ.500 పారితోషికం!
మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పెంపుడు పిల్లి తప్పిపోవడంతో యజమాని కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం పోస్టర్లు ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. అపోలో మెడికల్ బిల్డింగ్ పైన అద్దెకు నివాసముంటున్న కుతుబుద్దీన్ కుటుంబం గత కొంతకాలంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకుండా పోవడంతో వారి కుమారుడు పోస్టర్లు వేయించి వెతుకులాట చేపట్టాడు.
ఫొటోలో ఉన్న పిల్లి ఎవరికైనా కనిపించినా, దాని ఆచూకీ తెలిసినా సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పిల్లి ఆచూకీ తెలిపిన వారికి రూ.500 పారితోషికం అందజేస్తామని తెలిపారు.




