Gudur: గూడూరు సర్కారు దవాఖానలో గణపతి మహా అన్నప్రసాద వితరణ
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గణపతి నవరాత్రుల సందర్భంగా సర్పంచ్ సునీత కుమ్మాలు నాయక్ ఆధ్వర్యంలో మహా అన్నదానం జరిగింది.
Gudur: గూడూరు సర్కారు దవాఖానలో గణపతి మహా అన్నప్రసాద వితరణ
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి వర్గాలు, స్థానికుల ఆధ్వర్యంలో ‘మహా అన్నప్రసాద’ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, గూడూరు గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత కుమ్మాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించే వినాయక ఉత్సవాలు భక్తిభావాన్ని నింపుతాయని, రోగులందరూ త్వరగా కోలుకోవాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ మహా అన్నప్రసాద కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, ఆసుపత్రి వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




