Mahabubabad: గురుకుల కళాశాల ఘటన ఇద్దరిపై సస్పెన్షన్, ప్రిన్సిపల్‌కు నోటీసు
Mahabubabad: మహబూబాబాద్ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల వాష్‌రూమ్‌లో విద్యార్థిని ప్రసవించిన ఘటనపై కార్యదర్శి కె. సీతా లక్ష్మి ఇద్దరిని సస్పెండ్ చేశారు.
Mahabubabad: గురుకుల కళాశాల ఘటన ఇద్దరిపై సస్పెన్షన్, ప్రిన్సిపల్‌కు నోటీసు
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలోని వాష్ రూమ్ లో విద్యార్థిని ప్రసవించిన దిగ్భ్రాంతికర ఘటనపై గురుకులాల సొసైటీ ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు.విధుల్లో నిర్లక్ష్యంపై గురుకులాల సొసైటీ కార్యదర్శి కె. సీతా లక్ష్మి సీరియస్.. ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు.. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.కళాశాల వాష్‌రూమ్‌లో ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థినుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ, కళాశాల సిబ్బంది పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తడంతో గురుకులాల సొసైటీ కార్యదర్శి కె. సీతా లక్ష్మి ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై స్టాఫ్ నర్స్ (ఏఎన్‌ఎం) అంగోతు నీల, జంతుశాస్త్రం అతిథి అధ్యాపకురాలు (హౌస్ మాస్టర్) డి. చైతన్యలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ కళాశాల ప్రిన్సిపల్ బిందు మాధవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థినుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు కళాశాలలో ఏం జరిగింది? విద్యార్థిని ప్రసవించే పరిస్థితి వచ్చే వరకు సిబ్బంది పర్యవేక్షణ ఏమైంది? బాధ్యులపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి.ఈ ఘటనతో గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థినుల భద్రత, ఆరోగ్య పర్యవేక్షణపై మరోసారి చర్చ మొదలగురుకుల కళాశాల ఘటనపై ఉన్నతాధికారుల చర్యలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.




