Mahabubabad: ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలన్న అడిషనల్ కలెక్టర్

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ సూచనల మేరకు, డీపీఆర్వో ఆధ్వర్యంలో జర్నలిస్టుల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 15 Jun 2026 8:37 PM IST
Mahabubabad
X

Mahabubabad: ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలన్న అడిషనల్ కలెక్టర్

మహబూబాబాద్: మానవతా సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్, పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారి సూచనల మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా జిల్లా జర్నలిస్టులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన సేవలను అందించే అవకాశముంటుందని తెలిపారు. సేవా భావం కలిగిన ప్రజలు, యువత, ఉద్యోగులు, జర్నలిస్టులు రెడ్ క్రాస్ సభ్యత్వాన్ని పొందాలని కోరారు.కార్యక్రమంలో పలువురు సీనియర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story