Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్‌లో రైతుల ఆందోళన!

Mahabubabad: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

A.Rajkumar, Mahabubabad
Published on: 23 Jun 2026 2:21 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్‌లో రైతుల ఆందోళన!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి , మొక్కజొన్న రైతులకు వెంటనే డబ్బులు ఇవ్వాలంటూ

రైతులు వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు కు తాళం వేసి... నిరసన వ్యక్తం చేశారు. మా డబ్బులు.. మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఎన్.ఎస్ ట్రేడర్స్ మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ లో, మార్కెట్ బయట రైతుల నుంచి కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్నలకు వెంటనే డబ్బులు ఇప్పించాలని,

ఇప్పటికే 3 నెలలు గడిచిపోయిందని, రేపు, మాపు ఇస్తామని రైతులను తిప్పుతున్నారని, వ్యవసాయ సీజన్ ప్రారంభం తో విత్తనాలు, మందు బస్తాలు కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే డబ్బులు మాకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story