Mahabubabad: మహబూబాబాద్‌లో విద్యార్థుల ధర్నా స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి

Mahabubabad: పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద AISF ధర్నా. బకాయిలు చెల్లించాలని డిమాండ్.

A.Rajkumar, Mahabubabad
Published on: 23 July 2026 4:51 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో విద్యార్థుల ధర్నా స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి

మహబూబాబాద్: పెండింగ్ స్కాలర్ షిప్ లు , ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏ.ఐ.ఎస్.ఎఫ్ అధ్వర్యం లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏ.ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి శ్రావణ్ మాట్లాడుతూ....రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలుగా 11 వేల కోట్ల రూపాయలు స్కాలర్ షిప్ లు , ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు పేరకపోయాయని , వీటిని విడుదల చేయకపోవడంతో

ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని , దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయంబర్స్ మెంట్ , స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని , లేనిపక్షంలో ఆందోళనా కార్యక్రమాలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story