Mahabubabad: ఫాతిమా స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు
Mahabubabad: మహబూబాబాద్ ఫాతిమా హైస్కూల్‌లో షీ టీమ్, AHTU, DLSA సంయుక్త ఆధ్వర్యంలో బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Mahabubabad: ఫాతిమా స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, విద్యార్థినీ విద్యార్థులకు మహిళా భద్రత, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, బాలల రక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఫాతిమా హైస్కూల్, మహబూబాబాద్ నందు షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి స్వాతి మురారి గారు( Hon'ble Senior Civil Judge,Secretary DLSA), షీ టీం ఎస్ఐ కుమారి సునంద గారు, సీనియర్ లాయర్ Y. Chenna Mallela Reddy గారు విద్యార్థులకు షీ టీం విధులు, మహిళలు, బాలికలకు అందించే రక్షణ సేవలు, వేధింపులు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే విధానం, ఫిర్యాదుదారుల వివరాల గోప్యత గురించి వివరించారు. అలాగే సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, సైబర్ మోసాలు, అనుమానాస్పద లింకులు, OTPల పట్ల అప్రమత్తత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు.
మానవ అక్రమ రవాణా నివారణ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద పరిస్థితులను వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావడం గురించి వివరించారు. POCSO చట్టం, బాలల హక్కులు, మహిళలు, చిన్నారులకు అందించే సేవలపై అవగాహన కల్పించారు.
అత్యవసర సమయాల్లో షీ టీం నంబర్ 8712656935, అత్యవసర నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సిస్టర్. బెలీనా మేడం, ఉపాధ్యాయ సిబ్బంది, సుమారు 300 మంది విద్యార్థినీ విద్యార్థులు, షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, సుధారాణి, ప్రియాంక, AHTU సిబ్బంది ఏఎస్ఐ రాజు అరుణ, సుప్రజ, తదితరులు పాల్గొన్నారు.




