Mahabubabad: బయ్యారంలో పంట మార్పిడికి మొగ్గు చూపుతున్న రైతులు!

Mahabubabad: నినో పరిస్థితులు, నీటి ఎద్దడి నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో రైతులు వరికి బదులుగా పప్పుధాన్యాల సాగుపై దృష్టి సారించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 11 Aug 2026 10:00 PM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారంలో పంట మార్పిడికి మొగ్గు చూపుతున్న రైతులు!

మహబూబాబాద్: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, నీటి వనరులపై ఒత్తిడి నేపథ్యంలో వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ లో రైతులతో ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ... బయ్యారం పెద్ద చెరువు ఆయకట్టు పరిధిలో వరి సాగు చేస్తున్న రైతులకు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగులో ఎదురయ్యే సవాళ్లు తదితర అంశాలపై రైతులతో విస్తృతంగా చర్చించి, పంటల వైవిధ్యీకరణపై అధికారులు అవగాహన కల్పించారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం లభించేలా పెసర, మినుము, కంది తదితర పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పెద్ద చెరువు నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలను సామూహికంగా సాగు చేయాలని రైతులను ప్రోత్సహించారు.

అధికారుల సూచనలకు రైతుల నుంచి సానుకూల స్పందన లభించింది. ఈ క్రమంలో గంధంపల్లి గ్రామానికి చెందిన రైతు పుల్లూరి బాలరాజు, గతంలో వరి సాగు చేయాలని నిర్ణయించుకున్న తన 2 ఎకరాల భూమిలో పెసర పంటను సాగు చేయడం ప్రారంభించారు. ఈ చర్య ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

పంటల వైవిధ్యీకరణ ద్వారా నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు రైతులు సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ భూక్య ప్రవీణ్,, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) కి పలువురు రైతులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story