Bayyaram: కోటగడ్డ శివాలయంలో ఆసక్తికర ఘటన.. భక్తులతో పాటు శునకం ప్రదక్షిణలు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ శ్రీ కంఠమహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేళ యజమాని గట్టు రమేష్ కుటుంబంతో పాటు ఒక శునకం ఆలయ ప్రదక్షిణలు చేసి ఆకట్టుకుంది.

NARASIMHARAO, BAYYARAM
Published on: 24 Nov 2026 12:15 PM IST
Bayyaram
X

Bayyaram: కోటగడ్డ శివాలయంలో ఆసక్తికర ఘటన.. భక్తులతో పాటు శునకం ప్రదక్షిణలు!

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో అతి పురాతనమైన కాకతీయ కాలంనాటి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమిన శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం నుంచి పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు , పాలాభిషేకం చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో ఉన్న పురాతన శివలయం లో ఓ వింత చోటుచేసుకుంది.

గట్టు రమేష్ కుటుంబ సభ్యులతో సహా ఉదయాన్నే లేచి యజమానులతో కలిసి ఆలయంలోకి వచ్చి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తున్న శునకాన్ని చూసి భక్తులు ఆశ్చర్య పోయారు. కాల భైరవ రూపంగా కొలిచే శునకం...ఇలా ప్రదక్షిణలు చేయడం శివుడి ఆజ్ఞ నే అంటూ భక్తులు వాపోతున్నారు.

ఈ సందర్భంగా గట్టు రమేష్ మాట్లాడుతూ.. నాకు నా చిన్నప్పటి దేవభక్తి ఎక్కువ అని శునకాలు అంటే నాకు చాలా ఇష్టమని మా ఇంట్లో రెండు శునకాలు పెంచుకుంటున్నాను, ప్రతిరోజు నేను పూజ చేసే వారిని ఆ పూజలో శునకాలు కూడా నా పక్కన ఉంటాయని, కాశి, వివిధ దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాతోపాటు వస్తాయని,

ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా కుటుంబం తో కలిసి కోడగడ్డ శివాలయం కి వెళ్లే క్రమంలో మా 2 వీలర్ ని అనుసరిస్తూ కొత్తపేట నుండి కోటగడ్డకు సుమారు ఐదు కిలోమీటర్ల పరిగెత్తి వచ్చి మాతోపాటు శివాలయ ప్రదర్శనలో పాల్గొన్నదని , మాతోపాటు,శునకంకి దేవ భక్తి ఎక్కువ అని తెలియజేశారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM