Bayyaram: కొత్తపేటలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొమరం భీమ్ కాలనీలో ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 15 Nov 2026 8:46 PM IST
Bayyaram
X

Bayyaram: కొత్తపేటలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి

బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీలో కొమరం భీం కాలనీలో కుల పెద్దయిన మెస్సు రాజశేఖర్ దొర ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసుల ఆత్మగౌరవ భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూల మాలలతో నివాళులు అర్పించి ఘనంగా ను నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా మెస్సు రాజశేఖర్ దొర మాట్లాడుతూ...బిర్సా

ముండా కేవలం 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం అస్థిత్వం కోసం, భూమి కోసం , వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అటవీ హక్కుల కోసం (మా భూమి.. మా పాలన) అనే నినాదంతో ఆదివాసులను ఏకం చేసి బ్రిటీష్ ప్రభుత్వంపై 1899లో గెరిల్లా పోరాటాన్ని నడిపి, 1900 జూన్ 9న తన 25వ ఏట విరమరణం పోందిన గోప్ప ఆదివాసీ యోధుడని కోని

ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగాలను , ఆదివాసీ సంస్కృతిని, హక్కులను పోరాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టెం పుల్లయ్య, ఇరుప రామారావు, వట్టం శీను, చాట్ల సంపత్, చాట్ల అశోక్, సూర్ణపాక వెంకటేష్(పండు)ఆదివాసి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM