Mahabubabad: 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో 'హర్ ఘర్ తిరంగా'!
Mahabubabad: మహబూబాబాద్‌లో 100 మీటర్ల జాతీయ పతాకంతో బీజేపీ 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ. అంబేడ్కర్ విగ్రహం నుండి వివేకానంద సెంటర్ వరకు హోరెత్తిన దేశభక్తి నినాదాలు.
Mahabubabad: 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో 'హర్ ఘర్ తిరంగా'!
Mahabubabad: ప్రజల్లో దేశభక్తిని పెంపొంది ంచేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో 100 మీటర్ల జాతీయ పతాకం తో హర్ గర్ తిరంగా ర్యాలీ ని నిర్వహించారు. పట్టణం లో అంబేడ్కర్ విగ్రహం నుంచి వివేకానంద సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.విద్యార్థులు , పుర ప్రముఖులతో కలిసి బీజేపీ శ్రేణులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ....
భారత స్వాతంత్రోద్యమ చరిత్రను దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ దేశం లోని 140 కోట్ల మంది ప్రజల్లో దేశభక్తి , ఐక్యత ను పెంపొందించేందుకు ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరాలని ఉద్దేశంతో ప్రధాని మోదీ హర్ గర్ తిరంగా ర్యాలీ ని ఆగస్టు 10 వ తేదీ నుంచి 15 వరకు నిర్వహించాలని నిర్ణయించారన్నారు.
Next Story




