Mahabubabad: రాష్ట్రంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి.. రాంచందర్ రావు

Mahabubabad: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 5 Jun 2026 4:10 PM IST
Mahabubabad
X

Mahabubabad: రాష్ట్రంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి.. రాంచందర్ రావు

Mahabubabad: బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిపాలన లో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో రెండు రోజుల పాటు జరిగే బిజెపి ప్ర శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకొని ప్ర శిక్షణ శిబిరం ప్రాంగణం లో అమ్మ పేరు తో మొక్కలు నాటి పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం లో రెండు ప్రభుత్వాల కాలం లో అవినీతి తప్ప ఏమి చేయలేదని,

మోడీ 12 సంవత్సరాల పరిపాలన కాలం లో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని, 600 కోట్ల రూపాయలతో 300 ల పడకల ప్రభుత్వాసుపత్రి, బీబీనగర్ లో ఎయిమ్స్, ములుగు లో గిరిజన యూనివర్సిటీ, 32 జిల్లాలకు జాతీయ రహదారుల వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్, చేవెళ్ల, కామారెడ్డి ల డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోల్ల పై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రైతుల ధాన్యం మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి బాగా జరుగుతుందని. రాష్ట్రంలో బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు యాప. సీతయ్య, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story