Mahabubabad: శంకర్ నాయక్‌పై విమర్శలు తగవు.. మధుకర్ రెడ్డిపై బిఆర్ఎస్ మండిపాటు!

Mahabubabad: మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మూల మధుకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహబూబాబాద్ జిల్లా బయ్యారం BRS నేతలు తీవ్రంగా ఖండించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 25 Aug 2026 3:49 PM IST
Mahabubabad
X

Mahabubabad: శంకర్ నాయక్‌పై విమర్శలు తగవు.. మధుకర్ రెడ్డిపై బిఆర్ఎస్ మండిపాటు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో BRS పార్టీ మండల ఉపాధ్యక్షులు బానోత్ మురళీకృష్ణ , సర్పంచుల ఫోరం ఉపఅధ్యక్షుడు శివాజీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది,

మండల ఉపాధ్యక్షులు బానోత్ మురళీకృష్ణ , సర్పంచుల ఫోరం ఉపఅధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ బంజారా జాతి ముద్దు బిడ్డ,బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ పై రౌడీ షీటర్, రాజకీయ ఊసరవెల్లి మూల మధుకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

శంకర్ నాయక్ రాజకీయ స్థాయి, ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని మధుకర్ రెడ్డి తన స్థాయితో పోల్చుకోవడం హాస్యాస్పదమని అన్నారు. “గతంలో శంకర్ నాయక్ చుట్టూ తిరిగి, ఆయనకు వంగి దండాలు పెట్టిన రోజులను మరిచిపోయావా?” అని ప్రశ్నించారు. అధికారం ఎవరి చేతిలో ఉంటే వారి వైపు రాజకీయ రంగులు మార్చుకోవడం మధుకర్ రెడ్డి రాజకీయ సిద్ధాంతంగా మార్చుకున్నారని విమర్శించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం వంటి బాధ్యతాయుతమైన ప్రదేశానికి తన అనుచరులతో వెళ్లి అధికారులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ప్రజాస్వామ్య పోరాటంగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. “అధికారుల కార్యాలయాల్లో హంగామా చేయడం నాయకత్వం కాదు. ప్రజా సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడమే నిజమైన నాయకత్వం” అని స్పష్టం చేశారు.

బయ్యారం సొసైటీ వ్యవహారంపై శంకర్ నాయక్ స్పందించిన నేపథ్యంలో, మధుకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయనలోని రాజకీయ అసహనాన్ని బయటపెడుతోందని అన్నారు. DCO , శంకర్ నాయక్ ఉన్న సంబంధాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

శంకర్ నాయక్ కేవలం బయ్యారం సొసైటీ అంశంపైనే కాకుండా పెద్ది సుదర్శన్ విగ్రహం తొలగింపు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసుల వ్యవహారశైలి వంటి అనేక ప్రజా సమస్యలపై స్పందించారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలపై గొంతెత్తే నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం మధుకర్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.

“మధుకర్ రెడ్డి.. శంకర్ నాయక్ పై నోరు పారేసుకునే ముందు నీ రాజకీయ పునాది ఎంత బలంగా ఉందో ఆలోచించుకో. నిన్న ఒక నాయకుడి చుట్టూ తిరిగి, నేడు మరో నాయకుడి పంచన చేరి, రేపు ఇంకెవరి గడప తొక్కాలో ఆలోచించే రాజకీయాలకు ప్రజలు ఇక చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని హెచ్చరించారు.

శంకర్ నాయక్ విమర్శించినంత మాత్రాన మధుకర్ రెడ్డి పెద్ద నాయకుడు కాలేడని, ఆయనను తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన తన రాజకీయ స్థాయి పెరగదని అన్నారు. “ప్రజల్లో విశ్వాసం సంపాదించాలి.. మైకుల ముందు అరవడం వల్ల కాదు” అని ఎద్దేవా చేశారు.

ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు మానుకుని వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. మధుకర్ రెడ్డి రాజకీయ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ex.PACS V చైర్మన్ గంగుల సత్యనారాయణ,యాత్ అధ్యక్షులు లక్షణ్ నాయక్,సింగారం శ్రీను,వన్నం బాబురావు,జరపాల శ్రీను,సర్పంచులు దేవోజీ, శివాజీ, లలిత మహేష్ ప్రచార కార్యదర్శి RV,మధుకర్,లెనిన్, శ్రీకాంత్, శోభన్, ఉదయ్, మహేష్, వికాస్, మంజు తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story