Mahabubabad: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
Mahabubabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్రను నిరసిస్తూ మహబూబాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల బైఠాయింపు.
Mahabubabad: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
మహబూబాబాద్: బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేనమామగా కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపడితే.... కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను ఎత్తి వేసే కుట్రను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ శ్రేణుల బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని , కమిషన్ల కోసం వారికి...వారే కొట్లాడుకుంటున్నారని విమర్శించారు.ఒక అనామకుడు హైకోర్టులో కేసు వేస్తే కనీసం కౌంటర్ కూడా వేయాలని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.
మంచి మనసుతో ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకానికి లక్ష 16 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని , తులం బంగారం ఇవ్వకపోయినా , కనీసం లక్ష రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకాన్ని కొనసాగించేవరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమం లో పలువురు బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




