Mahabubabad: ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం!
Mahabubabad: కేంద్ర ఆసుపత్రిలో సీలింగ్ కూలిపోయింది. పీడియాట్రిక్ కేర్ వద్ద ప్రమాదం తృటిలో తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు సీలింగ్ తొలగింపు.
Mahabubabad: ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం!
మహబూబాబాద్: జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో సీలింగ్ కూలిపోయిన ఘటన లో ప్రమాదం తప్పింది. పీడియాట్రిక్ కేర్ యూనిట్ కు వెళ్లే కారిడార్ లో సీలింగ్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో
అంతా ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సిబ్బంది తో సీలింగ్ మొత్తాన్ని తీసి వేయించారు.
ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. ఇంకా ఆస్పత్రి భవనం లో చాలా చోట్ల పెచ్చులు ఊడి పడేలాఉంది. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రోగులు , రోగుల బంధువులు కోరుతున్నారు.




