Mahabubabad: ఓటు పరిరక్షించుకోవాలి - కలెక్టర్ స్నేహ శబరిష్

Mahabubabad: మహబూబాబాద్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటర్లు తమ ఓటును కాపాడుకోవాలని సూచించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 3 Sept 2026 11:25 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఓటు పరిరక్షించుకోవాలి - కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మహబూబాబాద్ పట్టణంలోనీ హనుమంతుని గడ్డ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్, పద్మశాలి భవన్, పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నోటీసులు అందించడం కొనసాగుతుందని, అందించిన నోటీసులకు సంబంధించి (11) రకాల గుర్తింపు కార్డులను సంబంధిత బూతు లెవల్ అధికారులకు అందజేసి తమ ఓటును పరిరక్షించుకోవాలని కలెక్టర్ కోరారు.

జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్ ప్రకారం సంబంధిత సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రతిరోజు ఆన్లైన్లో నివేదికలను అప్లోడ్ చేయాలని, ఇంకా రాని నోటీస్ అందుకున్న ఓటరు కు స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం అందించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత బూతు లెవల్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేశ్వరి, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉపేందర్, ఉప తాహసిల్దార్ నాగరాజు, రాజు, తదితరులు ఉన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story