Mahabubabad: ఉమా మురళీ నాయక్ ఆధ్వర్యంలో నిరసన!
Mahabubabad: మహబూబాబాద్ గాంధీ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నా.
Mahabubabad: ఉమా మురళీ నాయక్ ఆధ్వర్యంలో నిరసన!
Mahabubabad: రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ విగ్రహం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
నీట్ పేపర్ లీక్ కావడంతో కోట్లా దిమంది విద్యార్థులు నష్టపోయారని , విద్యార్థులు , వారి తల్లిదండ్రులు కన్న కలలు అడియాసలయ్యాయని , ఇప్పటి వరకు బిజెపి ప్రభుత్వంలో 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని , వెంటనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ పై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతర ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమం లో కాంగ్రెస్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




