Mahabubabad: మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: జినుకల రమేష్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కౌసల్యదేవిపల్లిలో కాంగ్రెస్ నాయకుడు జినుకల రమేష్ మాట్లాడుతూ, తమది ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న చేతల ప్రభుత్వమన్నారు.
Mahabubabad: మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: జినుకల రమేష్!
Mahabubabad: కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న చేతల ప్రభుత్వమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జినుకల రమేష్ అన్నారు. కౌసల్య దేవిపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పదేళ్ల గులాబీ ప్రభుత్వ పాలనలో అనేక హామీలు ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ వంటి పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కులం, మతం, రాజకీయ భేదాలు లేకుండా అర్హత ఆధారంగా అందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులు ముందుగా తమ పార్టీ, తమ ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జినుకల రమేష్ అన్నారు.




