Bayyaram: మహబూబాబాద్ లో విషాదం కాంగ్రెస్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కాంగ్రెస్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి. భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.
Bayyaram: మహబూబాబాద్ లో విషాదం కాంగ్రెస్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గుర్రం అన్న పూర్ణ గారు నిన్న 08-11-2026 న అనారోగ్య కారణంగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించగా వారి స్వగృహంలో వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గంధంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బయ్యారం మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, గంధంపల్లి, కొత్తపేట గ్రామశాఖ అధ్యక్షులు కారుబోతుల రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావురి రామచంద్రయ్య, నందగిరి భద్రయ్య, సీనియర్ రిపోర్టర్ మద్దినేని గుట్టయ్య తదితరులు పాల్గొన్నారు.




